"అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా - గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా"
అని సినీకవిగారు పాడిస్తారు ఓ సినిమాలో, హాస్యనటుడి చేత.
మనం ఇప్పుడు దాన్నే హీరోల చేత పాడిస్తున్నాం.
చంద్రబాబుగారు ముఖ్యమంత్రి అయ్యాక తొలిసంతకం అప్పుల మాఫీ మీదే చేసి తను హీరో అనిపించేసుకున్నారు.
అయితే అది ఏమంత మంచి పని కాదని ప్రపంచబ్యాంకు మొదలుకొని, రిజర్వు బ్యాంకు వరకూ అందరూ చెప్పేశారు.
తిమ్మిని బమ్మి చేసైనా సరే, మాట నిలుపుకుంటానని శపథం చేసారు ముఖ్యమంత్రిగారు.
నా అసలు బాధ ఏంటంటే, మా నాన్నగారు సినిమాలు పెద్దగా చూడని పాతకాలం మనిషి- నన్ను వేమన పద్యాల మీద పెంచారు- 'అప్పు లేని వాడె అధిక సంపన్నుడు' అని వేమనగారు చెబితే నేను 'నిజం గామోల్సు' అనుకున్నాను. ఒక్క పైసా అప్పు చేయలేదు ఇన్నాళ్ళూ. అందరూ వ్యవసాయ రుణాలు తీసుకొని కార్లు కొనుక్కుంటుంటే, నేనేమో నాకు ఎవరో, ఎప్పుడో పెట్టబోయే కిరీటం- 'శహభాష్! పైసా అప్పు చేయకుండా బ్రతికాడు' అని చేసే సన్మానం గురించిన ఊహల్లో బ్రతుకుతూ అసలు ఏ అప్పూ పెట్టలేదు-
ఇప్పుడు ఇదంతా అటూ ఇటూ తిరిగి నాకే శఠగోపం పెట్టింది. అందరికీ లక్షలు రాల్తున్నై, ఉలకాగా. నాకేమో చిల్లి గవ్వ రాదు. అది నా అసలు బాధ.
అయితే ఇక్కడ నేను చెప్పేది అది కాదు- ముఖ్యమంత్రిగారు ఋణమాఫీలో తలమునకలైపోయి, రాష్ట్రానికి ఇంకా వేరేవి కూడా చాలా అవసరం అన్న సంగతి మర్చిపోయినట్లు ప్రవర్తిస్తుండటం. కొత్తగా తయారైన (పాత) రాష్ట్రం మనది. చాలా అవసరాలున్నై.
౧. ప్రతి ఆఫీసులోనూ సమైక్యాంధ్ర ఉద్యమంనుండి-ఎలక్షన్లనుండి పేరుకుపోయిన మామూలు దస్త్రాలు కట్టలు కట్టలు కాదు- కుప్పలు కుప్పలు ఉన్నై. ఆఫీసుల్ని ఊడ్పించి, దుమ్ము దులిపించి, సున్నాలు వేయించి, దస్త్రాలనన్నిటినీ క్లియర్ చేయించే పని మొదటిది. హైదరాబాదులో మరి ఆఫీసులే లేవట! వాటినీఇప్పించాలిగా, ముందు?!
౨. ఉద్యోగులు ఎప్పటిలాగానే పదకొండుకు ఆఫీసులకొచ్చి, పన్నెండుకు లంచ్‌కెళ్ళి, మూడుకు తిరిగొచ్చి, నాలుగుకల్లా ప్యాకప్ చెప్పేస్తే ఇక కాంగ్రెస్కి జనాలు వందనం ఎందుకు చేసినట్లు? అందర్నీ ఆఫీసులకొచ్చేట్లు, వీలైతే పని చేసే ఊళ్ళోనే ఉండేట్లు చెయ్యాలి.
౩. రాయలసీమనుండి హైదరాబాదుకు ఓ మంచి నాల్గు కార్ల రోడ్డుంది. మరి అనంతపురం నుండి విజయవాడ ఎప్పుడైనా వెళ్ళారా? ఒంగోలుకు? పోనీ విశాఖకు? అసలు రోడ్డు ఉందా అని అనుమానం వచ్చే ప్రదేశాలు ఉన్నై! అవి అట్లా ఉంటే ఇక రాయలసీమలో హార్డువేర్లు ఎక్కడినుండి వస్తాయి స్వామీ, ఉన్న పార్టులు ఊడిపోతై తప్పిస్తే?! అందుకని, మన రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాలను ఓ పదింటిని లెక్కబెట్టి, వాటిని అన్నిటినీ కలుపుతూ రోడ్ల నెట్వర్కులు ప్లాన్ చేయాలి. అవసరం, త్వరగా.
౪. రాముడి రాజ్యంలో నెలకు మూడు వానలు కురిసేవట. చంద్రబాబుగారి పాత హయాంలో రైతులు పడ్డన్ని కష్టాలు మరెవ్వరూ పడలేదు. బాబుగారు పట్టించుకోలేదు సరే, ఆ కాలంలో రైతుల్ని దేవుడు కూడా పట్టించుకోలేదు. వానలు లేక రైతులు ఎండిపోయారు. తట్టుకోలేక కాంగ్రెసును గెలిపించారు జనాలు. రాజశేఖరుడి జాతకం బావుండింది- రైతులకు పంట రుణాలొచ్చాయి, క్రాప్ ఇన్సూరెన్సులు వచ్చాయి, ఆరోగ్యశ్రీలు, గ్రామాల్లో రోడ్లు- ఇక కేంద్రం పుణ్యమా అని వందరోజుల పని అన్నీ వచ్చి పడ్డాయి. దేవుడికి ఏమనిపించిందో, దండిగా వానలూ కురిపించేశాడు.
ఇప్పుడు మళ్ళీ బాబుకి ఓటేస్తూ రాయలసీమలో ఆందోళన చెందని రైతు లేడు- 'ఈ అయ్యకు వేస్తున్నాం- ఈసారైనా వానలు పడతాయో లేదో' అని. (నాకు తెలుసు-శాస్త్ర ప్రకారం వానలకి-బాబుకి ఏమీ సంబంధం లేదు. కానీ నేను చెబుతున్నది నాగురించి కాదు. రైతుల గురించి. రైతుకు నా శాస్త్రం తెలీదు)
వానలు పడకపోతే, రైతు బతికేంద్కు ప్రభుత్వం ఏదైనా చెయ్యాలి. ఏం చేస్తున్నావు స్వామీ, బాబూ? త్వరగా తెములు.
ఏం చెయ్యాలో ఆలోచించు. కరువు నెత్తిమీద పడ్డాక ఏం చేస్తాం, ముందే మేల్కొనాలి కానీ?!
౫. విద్యార్థులు తన్నుకులాడుతున్నారు. కొత్త పుస్తకాలన్నీ తెలంగాణమయాలు! ఏవో కొత్త పద్ధతులు. ఎవరో హైదరాబాదులో ఉన్న సాఫ్టువేరు నిపుణులట, తెలుగు పుస్తకాలు డిసైడు చేశారు. ఓసారి చూడండి. వాటిలో 'కంటెంటు ఏముంది?' అని చూడండి. 'అన్నీమీరే కనుక్కోండి- గ్రూపుల్లో కలిసి కూర్చొని ఆలోచించండి' అని చిన్నపిల్లలకు చెబితే ఎలాగమ్మా?! టీచర్లకే ఏమీ రాదే?! టీచర్లు పిల్లలు అందరూ మూకుమ్మడిగా ఆలిన్వన్నులు కొనుక్కుంటున్నారు. "మీ తరగతిలో వంకాయ కూర ఎలా చేశారో రాయండి" అని ప్రశ్నలిస్తారూ? మేం ఆలిన్వన్నుల్లో చూసి రాస్తాం! అంటున్నారు వాళు. ఇలాగైతే ఎలాగ? పుస్తకాలను మనవాళ్లతో తిరగరాయించాలి. ఒక దృక్పథం ఉండాలి. వాటికి కసరత్తు బాగా జరగాలి. మొదలు పెట్టాలి కదా, ముందు?!
౬. రాజధాని ఎక్కడ అనే ప్రశ్న ఉండనే ఉన్నది.
౭. వైద్యం గందరగోళం. ప్రభుత్వ ఆస్పత్రులు గందరగోళం. ఏదో ఒకటి చేయకపోతే మిన్ను విరిగి పడుతుంది.
౮. కేంద్రంలో మంత్రులకు సొంత వ్యాపారాలు ఉండరాదని మోడీగారు చెప్పేశారు. మరి రాష్ట్రంలో చూస్తే ఒక్కో మంత్రికీ లెక్కలేనన్ని వ్యాపారాలు. ఒకాయన విద్యావ్యాపారం.. ఒకాయన రవాణా. ఒకాయన ఇంకేదో.. ఎలాగయ్యా ఇంక?! వీళ్ళంతా మంత్రులుగా ఉండి, తమకి తాము నేరుగా లాభం చేసుకుంటే జనాలు కళ్ళుమూసుకొని పోయేట్లుందా, పరిస్థితి?!
౯. కరెంటు గందరగోళం. ఉత్పత్తికి కావలసిన బొగ్గు, గ్యాసూ గందరగోళం..
రాస్తే ఇంకా చాలా ఉన్నై, త్వర త్వరగా చేయాల్సిన పనులు. అన్నీ వదిలిపెట్టేసి, రుణమాఫీని పట్టుకొని తలమునకలైపోతే ఎలాగ?
త్వరగా తెమలాలి! చురుకుదనం ఇప్పుడు తేకపోతే ఇక మీద రాదు! సమయం మించిపోకనే అన్ని రంగాలలోనూ విధాన పరమైన స్పష్టత తేవాలి.

No comments:
Post a Comment